Thursday, 6 April 2017

ఒక్క ట్రిప్ కు “వందల కోట్ల” బిల్లు.. ఏ గ్రహానికి వెళ్ళారో అనుకుంటున్నారా..? కానీ అతను కిలోమీటర్ కూడా తిరగలేదు..!


ఈ మధ్య క్యాబ్ సర్వీస్ లు వచ్చేసిన తరవాత మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నాసింపుల్ గా “ఓలా” లేదా “ఉబెర్” బుక్ చేసేస్కోని వెళ్పోతాము. ఆటో కంటే తక్కువ ధరలో వెళ్పోతాము, పైగా ఏసీ లో వెళ్తాము. వాలెట్ తో మనీ పే చేయొచ్చు కాబట్టి కాష్ కష్టాలు ఉండవు. మనకు బోనస్ గా ఫ్రీ రైడ్ ఆఫర్స్ కూడా వస్తుంటాయి. మన రాష్ట్రంలో కంటే “ముంబై” లో క్యాబ్ సేవలు పొందేవారు ఎక్కువమంది ఉంటారు. బిల్ అయితే వందల్లో అవుతుంది లేదంటే వేళల్లో అవుతుంది. వేళల్లో అవ్వడం కూడా అతి తక్కువ సందర్భాల్లో. కానీ 149 కోట్లు బిల్ వచ్చింది అంటే నమ్మగలరా? ఇటీవల ఏప్రిల్ 1 న ముంబై లో ఈ సంఘటన చోటు చేసుకుంది..!
ముంబైకి చెందిన సుశీల్ నార్సియ‌న్ ఏప్రిల్ 1 తేదీన ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ములుంద్ వెస్ట్‌లో నివాసముంటున్న సుశీల్ ..300 మీట‌ర్ల దూరంలో ఉన్న వకులా మార్కెట్‌కు వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేశాడు. సుశీల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండ‌టంతో ఓలా క్యాబ్ డ్రైవ‌ర్ సుశీల్ ఉన్న ప్రాంతాన్ని మ్యాప్స్ ద్వారా గుర్తించ‌లేక పోయాడు. క్యాబ్ ఎంత‌సేప‌టికీ రాక‌పోవ‌డంతో సుశీల్ క్యాబ్‌ను వెతుక్కుంటూ వెళ్లాడు.అయితే డ్రైవ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లే స‌రికి ఆ డ్రైవ‌ర్ రైడ్ ను క్యాన్సిల్ చేశాడు.
Click Here Video Available  రైడ్ కాన్సుల్ అవ్వడంతో మరో క్యాబ్ బుక్ చేసాడు సుశీల్. కానీ బుక్ చేసే ప్రయత్నంలో అనుకోని షాక్ కు గురయ్యాడు. ఔట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఒకేసారి రూ.149 కోట్లు చూపించింది. ఏప్రిల్ 1 కదా కంపెనీ వారు కూడా ఫూల్ చేస్తున్నారేమో అనుకున్నాడు. కానీ వాలెట్ లో ఉన్న 129 రూపాయలు కూడా కట్ అవ్వడంతో నిజమని నమ్మి. వెంటనే ఈ సంఘటనను ఓలా ఆఫీషియల్ కి ట్వీట్ చేసాడు. స్పందించిన “ఓలా” సంస్థ. టెక్నికల్ లోపం వల్ల ఇలా జరిగిందని క్షమించమని సుశీల్ ని అడిగి 129 బాలన్స్ ను రిఫండ్ చేసింది.
ఓలా పంపిన రూ.149 కోట్ల బిల్లును సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో నెటిజెన్లు త‌మ‌దైన శైలిలో కామెంట్స్ పెట్టారు. రూ.149 కోట్ల డ్రాప్ పాయింట్ ఎక్క‌డ‌..? ఏ గ్ర‌హానికి బ‌య‌లు దేరావు అంటూ కామెంట్స్ చేశారు.

No comments:
Write comments