Monday, 3 April 2017

ఏండి పోయిన బోర్లు మాకిస్తే ..భూగర్భంలో నీళ్ళు మీకిస్తాం-తప్పక ప్రతి ఒక్కరు షేర్ చేయాల్సిన ఆర్టికల్ ..


ఏండి పోయిన బోర్లు మాకిస్తే ..భూగర్భంలో నీళ్ళు మీకిస్తాం _ SAVE విజయ్ రాం గారు ..

పోలాలలో , మన గ్రామాలలో ఎక్కడ చూసిన ఎండి పోయిన బోర్లే ఎక్కువ ... మన పోలాలలో , మన వీధిలోని వర్షపు నీరు అంతా వీధి రోడ్లకు బలి అవుతుంది .. అలా కాకుండా ఆ వర్షపు నీటీ భూమి లోపల దాచిపేడితే ...ఆ వర్షపు నీరు మనకు ఆదారం అవుతుంది . భూగర్భజలాలు పెరుగుతాయి ..పోలాన్ని పల్లంగా చేసి వర్షపు నీరు అంతా ఆ తోట్టిలాంటి(  బోరు చుట్టు కట్టీన ప్రదేశానికి ) చేరేటట్టు చేయాలి .. చెత్తా , చెదారం తోట్టిలో పడకుండా జగ్రత్త పడాలి.
నిరుపయోగంగా ఉన్న బోరు ... వర్షపు నీరు ఇంకించే పద్ధతి :
1.10 అడుగుల లోతు X 10 అడుగుల వెడల్పు తో బోరు పైపు చుట్టు గుంత తీయాలి ...
6 అడుగుల లోతు X 10 అడుగుల వెడల్పు తో బోరు పైపు చుట్టు గుంత తీయాలి ...
6 అడుగుల లోతు X 6 అడుగుల వెడల్పు తో బోరు పైపు చుట్టు గుంత తీయాలి ...
లోతు , వ్యాసార్థాన్ని బట్టి వర్షపు నీటిని భూమి లోపల ఇంకింప చేయావచ్చు ...
2.పోలం లో పడ్డ లేదా , ఖాలీ స్థలంలో వృధాగా పోతున్న వర్షపు నీటిని మనం భూగర్భజలాలు గా మార్చవచ్చు..
3.బోరు పైపు భూమి లోపలకి కృంగి పోకుండా  భూమి సామర్థ్యాన్ని బట్టి ఒక్క అడుగు లేదా అంతకంటే ఎక్కువ  బోరు పైపు చుట్టు సిమెంట్ , కంకరతో గట్టి దిమ్మెను కట్టాలి .
4.దిమ్మెపై ఇసుప క్ల్యాంపులు నిర్మించాలి ..
5.కెసిన్ పైపుకు  " డైమండ్ ఆకృతి " లో సన్నటి రంధ్రాలను వేయాలి .
6.కెసిన్ పైపు చుట్టు బలమైన మెస్ ను మూడంచెలు గా చుట్టాలి . ( మూడు వరసలలో చుట్టాలి )
7.సగభాగం పెద్ద రాళ్ళతో నింపాలి (అంటే  10 అడుగులు గుంతలో 4 - 5 అడుగుల వరకు ) , కెసిన్ పైపు తగల కుండా జాగ్రత్త పడాలి .
8."లావు కంకర " తో మిలిన సగ భాగంలో సగం నింపాలి ..( 10 అడుగులు గుంతలో మిలిన 6 అడుగులలో  3 అడుగులు  )
9."సన్నకంకర " తో మిలిన 3 అడుగులలో ఒక్క అడుగు నింపాలి .
10.మిలిన పై భాగం లో మట్టి గుంతలో పడకుండా ఒక్క అడుగు మేరా సైడ్ తవ్వి , ఆ భాగంలో సిమెంట్ గోడను కట్టాలి ఇది భూమి పై భాగం నుండి మరో 2 నుండి 3 అడుగులు ఎత్తుకు పెంచాలి .
11.దొడ్డు ఇసుక లేదా కంకర chips 1 అడుగు మేరా వేయాలి ...

Drinking WATER bore well లో  స్వచ్చమైన త్రాగునీరు కావాలి అంటే :
1.త్రాగునీరు బోర్లు అయితే చిప్స్ పైన అర అడుగు లేదా ఒక్క అడుగు మేరా బొగ్గు వేసి .. దాని పై HDEP మెస్ ను పరచాలి ..
2.HDEP మెస్ పై దొడ్డు ఇసుకని ఓ అడుగు మేరా వేయాలి ... ఈ ఇసుకను ఒక్కటి లేదా రెండు సంవత్సరాలకు ఓ సారి మార్చాలి ..
దయతో ఈ క్రింది వీడీయో లింకులపై క్లిక్ చేయండి ... మీరు వీడీయోలు చూడవచ్చు (: Please Watch this Video below about Direct Bore well recharge )

https://youtu.be/GPkEydAsjFc
https://youtu.be/5RmxRoDoGec
https://youtu.be/_j55sdgO9LE
https://youtu.be/8IBIcYiPzoo
https://youtu.be/9kvmNDrbQg8




No comments:
Write comments