Monday, 3 April 2017

సంచలనం..చంద్రబాబు, పవన్ కల్యాణ్‌‌ల మ్యాచ్‌ఫిక్సింగ్ బయటపెట్టిన జాతీయ మీడియా....!


2019లో జగన్ని అధికారంలోకి రానీయకుండా పవన్ కల్యాణ్ , చంద్రబాబులు ఇద్దరూ కల్సి నాటకం ఆడుతున్నారని  , ఎల్లో మీడియాలోని రెండు ఛానళ్లు పవన్ని ప్రమోట్ చేసే పనిలో పడిన సంగతి తెల్సిందే.  కేవలం జగన్ని సీఎం కాకుండా అడ్డుకోవడం కోసం పవన్ కల్యాణ్  జనసేన పార్టీని  2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విడిగా పోటీచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి , తద్వారా చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేలా రాజగురువు, పవన్ కల్యాణ్, చంద్రబాబుల మధ్య రహస్య ఒప్పందం కుదిరించిందని దరువు.కామ్ ఇదివరకే వెల్లడించింది..అంతే కాదు వైఎస్ జగన్ ఏదైనా ప్రజా సమస్యపై ఉద్యమించి

ప్రజల్లో టీడీపీ ప్రభుత్వాన్ని దోషులుగా నిలబెట్టగానే చంద్రబాబు బేలగా పవన్ కల్యాణ్‌ వైపు చూస్తున్నాడని..వెంటనే పవన్ రంగంలోకి దిగి ఎల్లోమీడియా సహకారంతో ఆ సమస్యను పక్కదారి పట్టించి చంద్రబాబును ఆదుకుంటున్నాడని కూడా దరువు ఇదివరకే వెల్లడించింది..ప్రత్యేక హోదా విషయంలో కానీ, ఆక్వాపార్కుల రైతుల ఆందోళనలో కానీ, రాజధాని రైతుల పోరాటంలో కానీ, అగ్రిగోల్డ్ బాధితుల విషయంలోకానీ ఇలా ఏదైనా ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ తనదైన శైలిలో చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను సాక్ష్యాలతో నిరూపిస్తూ ప్రజల ముందు చంద్రబాబును ముద్దాయిగా నిలబెడుతున్నాడు..దీంతో ఇరుకున పడ్డ చంద్రబాబు వెంటనే పవన్ని రంగంలోకి దించుతున్నాడు..పవన్ ప్రత్యేక హోదాపై యువత పోరాటాన్ని , ఆక్వాభాధితుల పోరాటాన్ని, అగ్రిగోల్డ్ బాధితుల అంశాన్ని నీరుగార్చిన సంగతి ఏపీలో ఇప్పుడు చదువుకునే ఏ పిల్లవాడిని అడిగినా చెబుతాడు..

 పవన్ ఓ సినీ సెలబ్రిటీ, ఆవేశం ఉన్న నాయకుడు, కానీ ఆలోచన లేదు..అసలే సిన్మాలు ఫ్లాప్ అయి ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితుల్లో చంద్రబాబే పవన్‌కు ప్యాకేజీ చెల్లిస్తున్నాడని విమర్శలు ఉన్నాయి..ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్‌ పవర్ స్టార్ కాదు..ప్యాకేజీ స్టార్ అని సెటైర్లు పడుతున్నాయి..కాగా  తాజాగా పవన్‌  చంద్రబాబుకు అనుకూలంగా రాజకీయాలు చేస్తున్నాడని  జాతీయ మీడియా సంచలన కథనం ప్రచురించింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో టీడీపీ బద్నాం కావడంతో రంగంలోకి దిగిన పవన్ సరిగ్గా వారం రోజుల తర్వాత విజయవాడ వెళ్లి అగ్రిగోల్డ్ బాధితులను కల్సి చంద్రబాబు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేస్తుందని భావించడం లేదని..అసలు అగ్రిగోల్డ్ అంశంలో చంద్రబాబు తప్పేం లేదన్నట్లుగా మాట్లాడి అసలు బాధితుల సమస్యను డైవర్ట్ చేశాడు..ఇదే విషయంపై జాతీయ మీడియా పవన్ కల్యాణ్‌పై తీవ్రంగా ధ్వజమెత్తింది.. పవన్‌లో  ప్రజా సమస్యలపై సీరియస్‌‌నెస్ కనిపించడంలేదని, కేవలం ప్రతిపక్ష నాయకుడు జగన్ ఏదైనా సమస్యపై పోరాటం చేయగానే పవన్ రంగంలోకి దిగి ఏదేదో చెబుతూ అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తూ చంద్రబాబుకు పరోక్షంగా సహాయం  చేస్తున్నాడని...పవన్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా కాకుండా పక్కా తెలుగుదేశం నాయకుడిగా కనిపిస్తున్నాడంటూ హెడ్డింగ్ పెట్టి మరీ విమర్శించింది..ఎల్లో మీడియా ఎలాగూ  చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నంతవరకు పవన్‌కు భజన చేస్తుంది..కనీసం జాతీయ మీడియా కథనాన్ని చూసైనా జనసేనాని తీరు చూసి పవన్ అభిమానులు సిగ్గుతో తలదించుకోవాలి..చంద్రబాబుకు కొమ్ముకాయకుండా. ప్రజలకు కొమ్ముకాయాలి అని అభిమానులంతా పవన్ని నిలదీసే రోజు ఆసన్నమైంది..


No comments:
Write comments