Saturday, 1 April 2017

బైక్ మీద వెళుతున్న వారికి ఎదురుపడ్డ అరుదైన “మనిషి జాతి”…బైక్ కంటే స్పీడ్ గా పరిగెత్తి మాయమయ్యాడు!

మనుషులు కోతి నుండి వచ్చారు అన్నది పాత మాటే. అయితే కోతి నుండి మనిషికి మధ్యలో ఎన్నో జాతులు ఉన్నాయి. ఎన్నో రకాలుగా మారి చివరికి మనిషి వచ్చాడు. అంతరించి పోయింది అనుకున్న ఒకరకం మనిషి జాతి ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి కేవలం మూడడుగులు మాత్రమే ఉన్నాడు. అతనిని పట్టుకునేలోపే మాయమైపోయాడు. వివరాలు మీరే చూడండి!

ఇండోనేషియాలోని సుమ‌త్రా దీవుల్లో బైక్ రేసింగ్ జ‌రుగుతోంది. అడవుల్లో కొందరు యువకులు అతివేగంగా బైక్ నడుపుతూ పోటీ పెట్టుకున్నారు. ఆ పోటీని బైక్ వెనక కూర్చున్నవారు కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు. హ‌ఠాత్తుగా ఓ వ్య‌క్తి పెద్ద క‌ట్టె ప‌ట్టుకుని ఎక్క‌డో చెట్ల‌ల్లోనుంచి ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ఇది చూసిన బైక్ రేస‌ర్ల‌లో ఒక‌రు భ‌యాందోళ‌న‌కు గురై బైక్‌పై నుంచి కింద‌ప‌డ్డాడు. ఆ ప్ర‌త్య‌క్ష‌మైన మ‌నిషి మూడున్న‌ర అడుగులు ఉంటాడు. ఇంత‌కీ ఎవ‌రా మ‌నిషి అని తెలుసుకునేందుకు బైక్‌లు న‌డిపేవారు ఫాలో అయ్యారు. కొద్ది దూరం వెంబ‌డించారు.

కానీ వారి వెంబడించిన లాభం లేకుండా పోయింది. బైక్ కంటే స్పీడ్ గా పరిగెత్తి మాయమైపోయాడు. పొదల్లోకి వెళ్లి వెతికిన దొరకలేదు. కొద్దీ సెకండ్లు మాత్రం అతనిని కింది వీడియో లో చూడొచ్చు.
         

ఆ వ్యక్తి మూడడుగులు ఉన్నాడని, అర్ధనగ్నంగా ఉన్నాడని రేసర్లు తెలిపారు. ఆ వ్యక్తి అంతరించిపోయారనుకుంటున్న గిరిజన వ్యక్తిగా కొద్దిమంది విశ్లేషిస్తున్నారు. వీరు అడ‌వినే ఆధారంగా చేసుకుని జీవిస్తుంటార‌ని బ‌య‌టి ప్ర‌పంచపు వ్య‌క్తుల‌ను చూస్తే భ‌య‌ప‌డి చాలా వేగంగా పరుగులు  తీస్తార‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. అయితే చివ‌రిసారిగా 17వ శ‌తాబ్దంలో మాంటే జాతికి చెందిన ఇద్ద‌రిని ప్రాణాల‌తో ప‌ట్టుకుని సుల్తాన్ రాజుకు అప్ప‌గించార‌ని హిస్టోరియ‌న్స్ చెప్పారు.
                                   

No comments:
Write comments