Saturday, 1 April 2017

బుద్ధుడి ఫొటో ముందు… అమ‌లా యోగా భంగిమ‌లు… మండిప‌డుతున్న నెటిజ‌న్లు..!

హీరోయిన్లు అన్నాక ఆ మాత్రం చేయాల్సిందేలే..! చేయ‌క‌పోతే ఎలా..! అదేనండీ… సినిమా రంగంలో అవ‌కాశాలు పుష్క‌లంగా రావాలంటే ఓ వైపు హాట్ హాట్‌గా క‌నిపించ‌డ‌మే కాదు, త‌మ అందాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌దును పెట్టుకోవాల్సిందే. చ‌క్క‌ని శ‌రీరాకృతి, అంద‌మైన మేని ఛాయ ఉండేలా ఫిగ‌ర్ మెయింటెయిన్ చేయాల్సిందే. అందుకు యోగాలు చేయ‌డం, జిమ్‌ల‌కు వెళ్ల‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే ఏముంది..! క‌రెక్టేగా..! అంటారా..! క‌రెక్టే కానీ… అలా చేసే క్ర‌మంలో ఏ ఒక్కరి మ‌నోభావాల‌ను కూడా దెబ్బ తీయ‌కూడ‌దు. అది హీరోయిన్లు అయినా… అందుకు ఎవ‌రూ అతీతులు కారు. ఇంత‌కీ విష‌య‌మేమింటే…

అమ‌లాపాల్ తెలుసు క‌దా… ప‌లు తెలుగు హిట్ సినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకోవ‌డ‌మే కాదు, హీరోయిన్‌గా ఇప్పుడు ఆమెకు త‌మిళ్‌, మ‌ళయాళం సినిమాల్లో మంచి ఆఫ‌ర్లే వ‌స్తున్నాయి. భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న అనంత‌రం ఈమె త‌న కెరీర్‌పైనే దృష్టి పెట్టింది. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న బాల‌య్య సినిమాలోనూ ఈ భామ‌నే హీరోయిన్‌గా నటించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మ‌ధ్యే ఈ భామ యోగా చేస్తూ ఆ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలే విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. ఇంత‌కీ ఆ ఫొటోల్లో ఏముందంటే…


అమ‌లాపాల్ ప‌లు యోగా భంగిమ‌ల‌తో ఉన్న ఫొటోలు అవి. వాటిలో ఆమె యోగా చేస్తున్న వెనుక గోడ‌కు బుద్దుని బొమ్మ కూడా ఉంది. అయితే ఆ ఫొటోల్లో ఒక ఫొటోలో మాత్రం అమ‌లాపాల్ కాళ్లు పైకి పెట్టి ఉండ‌గా వెనుకే బుద్దుడి త‌ల ఉంది. దీంతో ఈ ఫోటోను చూసిన వారు… యోగా బాగానే ఉంది, ఆరోగ్య‌క‌ర‌మే, కానీ బుద్ధుడిని అలా అవ‌మానించ‌డం ఏమీ బాగాలేదు… అంటూ అమ‌లా ఇన్‌స్టాగ్రాం పోస్టుపై కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపై అమ‌లా ఇంకా స్పందించ‌లేదు. చూడాలి మ‌రి… ఈ వివాదం ఇంకా ఎంత వ‌ర‌కు ముందుకు పోతుందో..?

No comments:
Write comments